: ఇమ్రాన్ ను కలవాలని నిర్ణయించుకున్న నవాజ్ షరీఫ్


పాకిస్థాన్ లో విపక్షాల ఆందోళన పర్వానికి తెరదించేందుకు ప్రధాని నవాజ్ షరీఫ్ నడుం బిగించారు. ఈ క్రమంలో తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ ను కలవాలని నిర్ణయించుకున్నారు. పదవి నుంచి తప్పుకోకపోతే షరీఫ్ నివాసంపై లక్షలాది మందితో దాడి చేస్తామని ఇమ్రాన్ హెచ్చరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో షరీఫ్ తాజా నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇమ్రాన్ తో భేటీ ద్వారా ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను చల్లబరచవచ్చన్నది షరీఫ్ వ్యూహంగా కనిపిస్తోంది. దేశం కోసమే ప్రధాని... ఇమ్రాన్ ఖాన్ తో సమావేశమవ్వాలని నిశ్చయించుకున్నారని పాక్ రైల్వే శాఖ మంత్రి ఖ్వాజా సాద్ రఫీక్ ట్విట్టర్లో పేర్కొన్నారు. రఫీక్... షరీఫ్ కు అత్యంత సన్నిహితుడని పేరుపడ్డారు. కాగా, వీరిద్దరి భేటీ ఎప్పుడన్నది రఫీక్ వెల్లడించలేదు.

  • Loading...

More Telugu News