: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది: సోనియాగాంధీ
పార్లమెంటులో, రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా బిల్లుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్పష్టం చేశారు. పార్టీ మహిళా కార్యకర్తలతో ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన ఆమె, రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పాస్ చేయించిందన్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల ఆ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందలేదు అని చెప్పారు. అయితే, తాము ఈ బిల్లు పాస్ చేయించేందుకు పార్లమెంటులో ఎన్డీఏపై ఒత్తిడి తెస్తామన్నారు.