: ఏపీ తొలి బడ్జెట్ చాలా నిరుత్సాహకరంగా ఉంది: వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ తొలి బడ్జెట్ చాలా నిరుత్సాహకరంగా ఉందని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. బడ్జెట్ లో వ్యవసాయ రుణాలకు ఎంత డబ్బు కేటాయిస్తున్నారో కనీసం ప్రస్తావించలేదని ఆయన విమర్శించారు. ప్రణాళిక వ్యయాన్ని 36 నుంచి 24 శాతానికి తగ్గించారని... రాబోయే రోజుల్లో పరిస్థితికి ఈ తగ్గింపు అద్దం పడుతోందని అన్నారు. జీడీపీ పూర్తిస్థాయిలో తగ్గిపోయే ప్రమాదం కనబడుతోందని ఆయన పేర్కొన్నారు. గృహ నిర్మాణానికి బడ్జెట్ లో అత్యంత తక్కువగా కేటాయింపులు జరిపారని ఆరోపించారు. ఈ బడ్జెట్ తో ఏపీలో ఒక్క గృహం కూడా నిర్మించే పరిస్థితి లేదని ఆయన వ్యాఖ్యానించారు.