: భారత్ తో సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు కట్టుబడి ఉన్నాం: పాక్ రాయబారి


భారత్ తో సమస్యల పరిష్కారం కోసం అర్ధవంతమైన చర్చల దిశగా శాంతియుతమైన మార్గాలను కనుగొనాల్సి ఉందని ఇక్కడి పాకిస్తాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ ఉద్ఘాటించారు. ఈ మేరకు న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. "ఇండియాతో మేము మంచి పొరుగు సంబంధాలను కలిగి ఉన్నాం. భారత్ తో పాక్ కు ఉన్న సమస్యలను శాంతియుత ప్రక్రియలు, అర్ధవంతమైన చర్చల ద్వారానే పరిష్కారించుకోగలమని నమ్ముతున్నాం" అని పేర్కొన్నారు. కాగా, జమ్మూకాశ్మీర్ వేర్పాటువాద నాయకులతో చర్చలు జరపడంపై తీవ్ర విమర్శలు రాగా, తమ చర్యను పాక్ రాయబారి సమర్ధించుకున్నారు. కాశ్మీర్ సమస్యకు శాంతియుత పరిష్కారం ఉండాలని, ఈ విషయంలో కాశ్మీరీలు చట్టబద్ధమైన వాటాదారులని అన్నారు.

  • Loading...

More Telugu News