: ఆంధ్రప్రదేశ్ లో ఐదు శిల్పారామాలు: యనమల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకేసారి ఐదు ప్రాంతాల్లో శిల్పారామాలు ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. కాకినాడ, ఏలూరు, విజయవాడ, నెల్లూరు, అనంతపురం పట్టణాల్లో శిల్పారామాలు త్వరలో ఏర్పాటు చేయనున్నామని ఆయన తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. దీంతో పాటు శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో పర్యాటక సర్క్యూట్లు ఏర్పాటు చేస్తామని యనమల చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న పేరుపాలెం బీచ్ లో అధునాతన రిసార్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆతిథ్య రంగాన్ని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కాకినాడ, తిరుపతిలలో 12 కోట్ల రూపాయలతో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కేంద్రాలను నెలకొల్పనున్నామని ఆయన ప్రకటించారు.