: వివాదంలో షారుక్ ఖాన్ నివాసం
బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ నివాసం 'మన్నత్' మరోసారి కోర్టు వివాదాల్లో చిక్కుకుంది. బంగ్లా వెలుపల ఉన్న రాంప్ నిర్మాణంపై చుట్టుపక్కల నివాసముండే వారు, వాచ్ డాగ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ కలసి బాంబే మున్సిపల్ కార్పోరేషన్ (బీఎంసీ)కు ఫిర్యాదులు చేశారు. అక్రమంగా నిర్మించిన ఆ నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరలో తొలగించాలని కోరారు. ఈ మేరకు ఫిర్యాదులను పరిశీలించిన బీఎంసీ చీఫ్ తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముంబయిలోని బ్యాండ్ స్టాండ్ వద్ద ఉన్న పాప్యులర్ మౌంట్ మేరీ చర్చ్ కు సమీపంలో షారుక్ బంగ్లా ఉంది. అయితే, బంగ్లా నుంచి చర్చ్ కు వెళ్లేందుకు ఓ షార్ట్ కట్ ఉంది. కానీ, రాంప్ పై షారుక్ ఉపయోగించే 'వానిటీ వాన్' నిలిపి ఉంచుతుండడంతో రోడ్డు బ్లాక్ అయి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.