: సంగీత ప్రియులకు త్వరలో 'రెహమాన్ యాప్'


స్మార్ట్ ఫోన్ల తర్వాత సాంకేతిక ప్రపంచంలో ప్రస్తుతం 'యాప్'ల హవా నడుస్తోంది. తాజాగా మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ త్వరలో తన సంగీత అభిమానుల కోసం ఓ యాప్ ను తీసుకురాబోతున్నాడు. ఈ మేరకు ఆయనే స్వయంగా ప్రకటించారు. ఎప్పటికప్పుడు తనతోను, తన సంగీతంతోను సౌకర్యవంతంగా అనుసంధానం అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపాడు. ఇప్పటికే ఫేస్ బుక్, ట్విట్టర్ లో రెహమాన్ ను ఇరవై నాలుగు మిలియన్ల అభిమానులు ఫాలో అవుతున్నారు. ఇప్పుడే ఒకే వేదిక ద్వారా కనెక్ట్ అయ్యేందుకు రెహమాన్ యాప్ తీసుకొస్తున్నాడు. క్వైకీ.కామ్ (Qyuki.com) దానిని రూపొందించనుంది.

  • Loading...

More Telugu News