: ఏపీ బడ్జెట్ హైలైట్స్ - 2
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ హైలైట్స్ ఇవే... * గ్రామీణాభివృద్ధి శాఖకు రూ. 6,094 కోట్లు * పంచాయతీరాజ్ శాఖకు రూ. 4,260 కోట్లు * గ్రామీణ నీటి సరఫరాకు రూ. 1,115 కోట్లు * పౌరసరఫరాల శాఖకు రూ. 2,318 కోట్లు * గృహ నిర్మాణ శాఖకు రూ. 808 కోట్లు * పర్యాటక శాఖకు రూ. 113 కోట్లు * యువజన సర్వీసులకు రూ. 126 కోట్లు * విలాంగులు, వృద్ధుల సంక్షేమానికి రూ. 65 కోట్లు * మహిళా శిశు సంక్షేమానికి రూ. 1,049 కోట్లు * మైనార్టీ సంక్షేమానికి రూ. 371 కోట్లు * గిరిజన సంక్షేమానికి రూ. 1,150 కోట్లు * వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రూ. 3,130 కోట్లు * కాపులను బీసీల్లో చేర్చేందుకు కమిటీ ఏర్పాటు * శ్రీకాళహస్తిలో సౌండ్ అండ్ లైట్ షో * పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెంలో బీచ్ రిసార్ట్స్ ఏర్పాటు * త్వరలోనే ఈ-పాసు పుస్తకాలు * అనంతపురం, నెల్లూరు, ఏలూరు, కాకినాడల్లో శిల్పారామాలు * ఎస్సీల సంక్షేమానికి రూ. 2,657 కోట్లు * స్మార్ట్ సిటీల అభివృద్ధికి రూ. 6,620 కోట్లు * రేషన్ కార్డులను ఆధార్ కార్డులతో అనుసంధానం చేస్తాం * భూ సేకరణకు ఈ-పేమెంట్ విధానం * త్వరలోనే అన్న క్యాంటీన్ల ఏర్పాటు * ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకానికి కృషి * ప్రతి కుటుంబానికి రూ. 2కే 20 లీటర్ల మినరల్ వాటర్ * కాకినాడ, తిరుపతిలో హోటల్ మేనేజ్ మెంట్ ఇన్ స్టిట్యూట్ లు * కర్నూలులో గ్రేహౌండ్స్ హబ్