: అందుబాటులోకి ఆన్ లైన్ లో శ్రీవారి దర్శనం టికెట్లు
తిరుమల శ్రీవారి ప్రత్యేక దర్శనానికి సంబంధించి రూ.300ల ఇంటర్నెట్, ఈ-దర్శనం టికెట్లను ఆన్ లైన్ లో టీటీడీ ఈవో ఎంజి గోపాల్ ఈరోజు విడుదల చేశారు. ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఐదు వేల ప్రత్యేక దర్శనం టికెెట్లను రిలీజ్ చేశారు. ఇందులో ఇంటర్నెట్ లో 2,500... ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని తొమ్మిది ఈ-దర్శన్ కేంద్రాలలో 2,500 టికెట్లను విడుదల చేశారు. ఈ రోజు టికెట్ తీసుకున్నవారికి సరిగ్గా ఏడవరోజు దర్శనం లభిస్తుందని అధికారులు తెలిపారు. అయితే, ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులోకి రావడంతో భక్తుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందని, ఒక్క నిమిషానికే మూడు వందల టికెట్లు అమ్ముడయ్యాయని అధికారులు చెప్పారు.