: ఆసుపత్రి పాలైన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ తపస్ పాల్ ఆసుపత్రిలో చేరారు. బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా కోల్ కతాలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారు. ఈ తెల్లవారు జాముున నాలుగు గంటల సమయంలో ఆయన్ను ఆసుపత్రికి తీసుకొచ్చారని ఆసుపత్రి అధికారి పి.టాండన్ తెలిపారు. వెంటనే అవసరమైన పరీక్షలు జరిపాక తపస్ బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్నట్లు గుర్తించామని, 72 గంటల అబ్జర్వేషన్ కోసం ప్రస్తుతం ఐసీయూలో ఉంచినట్లు వివరించారు. గతంలోనూ రక్తపోటు కారణంగా ఎంపీ ఇదే ఆసుపత్రిలో చేరారు. జూన్ లో ఓ ర్యాలీలో ప్రసంగించిన తపస్, మహిళలకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో, తీవ్ర సంచలనం రేగి విషయం కోర్టు వరకు వెళ్లింది. ఇటీవలే ఈ కేసు నుంచి ఆయనకు కలకత్తా హైకోర్టు విముక్తి కలిగించింది.