: టీడీపీ సభ్యులు నాపై దాడి చేశారు: స్పీకర్ కు చెవిరెడ్డి ఫిర్యాదు
శాసనసభ మంగళవారం నాటి సమావేశాల్లో భాగంగా కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు తనను అసభ్య పదజాలంతో దూషించడమే కాక దాడికి కూడా యత్నించారని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి, స్పీకర్ కోడెల శివప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. తనపై అనుచితంగా ప్రవర్తించడంతో పాటు దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బుధవారం ఆయన స్పీకర్ ను కోరారు. మంగళవారం సభలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కొందరు టీడీపీ సభ్యులు చెవిరెడ్డిపై అనుచితంగా వ్యవహరించారని వైసీపీ సభ్యులు తెలిపారు.