: అసోం ఎదురు కాల్పుల్లో ఐదుగురు తీవ్రవాదుల హతం
అసోంలోని చిరాంగ్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఎన్ కౌంటర్ లో ఐదుగురు తీవ్రవాదులు హతమయ్యారు. రాయిమతి, రునిఖాటా ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సైన్యంపై తీవ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో ప్రతిస్పందించిన సైన్యం తీవ్రవాదులపైకి కాల్పులు జరిపింది. సుధీర్ఘంగా జరిగిన ఈ కాల్పుల్లో ఐదుగురు తీవ్రవాదులు హతమైనట్లు సైనిక బలగాల ప్రతినిధి వెల్లడించారు. తీవ్రవాదులకు చెందినవిగా భావిస్తున్న ఓ ఏకే సిరీస్ కు చెందిన రైఫిల్, ఐదు పిస్టళ్లు, ఐదు గ్రనేడ్లు, 60 రౌండ్ల బుల్లెట్లు, రూ. 1 లక్ష నగదును స్వాధీనం చేసుకుననట్లు అసోం ఐజీ బిష్ణోయ్ తెలిపారు.