: భారత్, పాక్ ల మధ్య చర్చల పునరుద్ధరణకు అమెరికా యత్నం


భారత్-పాక్ ల మధ్య చర్చలకు మార్గం సుగమమయ్యేలా అమెరికా తన యత్నాలను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ లలోని తమ రాయబార కార్యాలయాల ద్వారా ఇరు దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ నెల 25న భారత్, పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శుల భేటీ జరగాల్సి ఉంది. అయితే కాశ్మీర్ వేర్పాటువాదులతో భారత్ లో పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్ చర్చలు నిర్వహించిన నేపథ్యంలో రెండు రోజుల క్రితం విదేశాంగ శాఖ కార్యదర్శుల భేటీని భారత్ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇరుదేశాల ప్రభుత్వాలతో ఆ దేశాల్లోని తమ రాయబార కార్యాలయాల ద్వారా నేరుగా సంప్రదింపులు జరపనున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు. చర్చల దిశగా ఇరు దేశాలను ఒప్పించగలమన్న విశ్వాసం తమకుందని ఆ ప్రతినిధి ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News