: తొలిసారి విదేశీగడ్డపై అడుగుపెట్టిన కేసీఆర్... షెడ్యూల్ వివరాలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన జీవితంలో తొలిసారి విదేశీ గడ్డపై అడుగుపెట్టారు. ఈ ఉదయం 6 గంటలకు ఆయన సింగపూర్ చేరుకున్నారు. సింగపూర్ లోని రిట్జ్ కార్టన్ హోటల్ వద్ద కేసీఆర్ కు ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. నాలుగు రోజుల తన పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు స్పోర్ట్స్ స్టేడియంను ఆయన పరిశీలిస్తారు. రేపు ఉదయం 11 గంటలకు హైకమిషనర్ తో, సాయంత్రం 4 గంటకు విదేశాంగ మంత్రితో సమావేశమవుతారు. 22న ఇంఫాక్ట్ సదస్సులో పాల్గొన్న అనంతరం సాయంత్రం 5 గంటలకు సింగపూర్ ప్రభుత్వ పెద్దలతో ఆయన భేటీ అవుతారు. 23న సింగపూర్ నుంచి రోడ్డు మార్గంలో ఆయన కౌలాలంపూర్ వెళతారు. 24 రాత్రికి కేసీఆర్ అక్కడ నుంచి హైదరాబాద్ తిరుగుపయనమవుతారు.