: 21 మంది ప్రాణాలు కోల్పోయేందుకు కారకులపై సస్పెన్షన్ వేటు
బీహార్ లోని తూర్పు చంపారన్ జిల్లాలో సమేరా వద్ద జరిగిన రైలు ప్రమాదంలో 21 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనకు బాధ్యులుగా ముగ్గురిని గుర్తించిన రైల్వే శాఖ వారిని సస్పెండ్ చేసింది. రైల్వే క్రాసింగ్ దగ్గర ఉన్న గేట్ మన్, సమేరా అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, మరోక రైల్వే ఉద్యోగి నిర్లక్ష్యం కారణంగా ఆ దారుణం చోటుచేసుకుందన్న రైల్వే ఉన్నతాధికారులు, వారు ముగ్గుర్ని విధుల్లోంచి తప్పించారు. ఈ ప్రమాదంలో 8 మంది చిన్నారులు, ఆరుగురు మహిళలు, ఏడుగురు పురుషులు మృత్యువాత పడగా, ఇద్దరు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు.