: కోటికి పైగా టోపీ పెట్టి...పిల్లల్ని వదిలేసి పారిపోయారు


డబ్బు మా చెడ్డది... మనిషిని ఎంతకైనా దిగజారుస్తుంది. కన్నవారు, తోడబుట్టిన వారు అనే తేడా లేకుండా ఎవరినైనా దూరం చేస్తుంది. ఇది మరోసారి రుజువైంది. ఇలాంటి డబ్బుకోసం పిల్లల్నే వదిలేశారా తల్లిదండ్రులు... సభ్య సమాజం అవాక్కయ్యేలా ఘరానా మోసం వెలుగుచూసింది. కర్నూలు పట్టణంలోని బుధవారపేటలో నాగేశ్వరరావు, శివమ్మ దంపతులు చిట్టీల పేరిట ఘరానా మోసానికి తెరతీశారు. చిట్టీల పేరిట కోటి రూపాయలకు పైగా వసూలు చేసిన వీరు పారిపోతుండగా చిట్టీలు వేసిన వారు నిలదీశారు. దీంతో ఆ దంపతులు తమ పిల్లలను వదిలేసి పలాయనం చిత్తగించారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పిల్లలను పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News