: వన్డేలకూ అదే జట్టుతో ఇంగ్లండ్... అదే ఫలితం పునరావృతమవుతుందా?


టెస్ట్ సిరీస్ లో భారత్ ను ఆటాడుకున్న జట్టునే వన్డేలకు కొనసాగించాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. భారత్ తో జరుగనున్న వన్డే సిరిస్ కు 15 మంది ఇంగ్లండ్ సభ్యుల బృందంలో 11 మంది టెస్ట్ జట్టులో ఆడిన వారినే ఈసీబీ ఎంపిక చేసింది. మరో నాలుగు మాత్రమే కొత్తముఖాలు కావడం విశేషం. అలెక్స్ హేల్స్, ఇయాన్ మోర్గాన్, హర్రీ గుర్నీ, జేమ్స్ ట్రేడ్ వెల్ వన్డేల్లో ఆడనున్నారు. నాలుగో టెస్టులో గాయపడిన స్టువార్డ్ బ్రాడ్ వన్డేలకు అందుబాటలో ఉండకపోవచ్చని ఈసీబీ వెల్లడించింది. బ్రాడ్ మోకాలికి సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఉండడం కూడా అతడికి తుది జట్టులో చోటు కల్పించకపోవడానికి కారణం అని ఈసీబీ అధికారులు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News