: ఆ ఏడు మండలాలు ఆంధ్రావే... గొడవ లేదు: కేసీఆర్


పోలవరం ముంపు మండలాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానివేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లో సమగ్ర సర్వే నిర్వహించలేదని అన్నారు. పార్లమెంటు, రాష్ట్రపతి ఆర్డినన్స్ లో పేర్కొన్నట్టు ఆ ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్భాగమని, అందులో వివాదం లేదని ఆయన స్పష్టం చేశారు. దానిపై మరో వివాదం రేపొద్దని ఆయన మీడియాకు సూచించారు. సర్వేలో అన్ని ప్రశ్నలు సులువుగా ఉన్నాయని అందరూ భావిస్తున్నారని, ఫార్మాట్ లో వివరాలు తమకు మాత్రమే తెలుస్తుందని ఆయన చెప్పారు. సర్వేలో పేర్కొన్న వివరాలు పూర్తిగా ఇస్తే లబ్ధిదారులు అవుతారని ఆయన పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసమే సర్వే చేపట్టామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News