: సర్వే నేటితో అయిపోలేదు... రేపు కూడా ఉంటుంది: తెలంగాణ డిప్యూటీ సీఎం
సమగ్ర సర్వే నేటితో అయిపోయిందని హైదరాబాద్ వాసులు ఎవరూ బాధపడవద్దని, సర్వే రేపు కూడా కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సర్వేలో తమ వివరాలు నమోదు కాలేదనో, ఎన్యూమరేటర్ తమ వద్దకు రాలేదనో హైదరాబాదు వాసులు ఆందోళన చెందవద్దని సూచించారు. అవసరమైతే సమగ్ర కుటుంబ సర్వే రేపు కూడా హైదరాబాదులో కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.