: పాతబస్తీలో సర్వే స్లో...!
హైదరాబాదులోని పాతబస్తీలో సమగ్ర కుటుంబ సర్వే మందకొడిగా సాగుతోంది. ఇంటి నెంబర్ల వ్యవహారంలో ఎన్యూమరేటర్లు గందరగోళ పడుతుండడంతో సర్వే నెమ్మదిగా నిర్వహిస్తున్నారని సమాచారం. వార్డు వారీగా ఎక్కువ మంది సిబ్బందిని నియమించినప్పటికీ భాష ప్రధాన సమస్యగా మారుతోంది. చార్మినార్, బహుదూర్ పుర, పురానాపూల్ తదితర ప్రాంతాల్లో సర్వే బాగానే జరుగుతోందని అధికారులు తెలిపారు. స్టిక్కర్లు అంటించని భవానీనగర్, ఫలక్ నుమా తదితర ప్రాంతాల్లో ఎన్యూమరేటర్లు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు తెలిపారు. సాయంత్రమైపోతున్నా ఎన్యూమరేటర్లు తమ ఇళ్లకు రాలేదని పలువురు ఆరోపిస్తున్నారు.