: సర్వే కోసం నా ఇంటికెవరూ రాలేదు: జేసీ
సమగ్ర సర్వే కోసం తన ఇంటికి ఎవరూ రాలేదని తాడిపత్రి శాసనసభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నవారెవరూ హైదరాబాద్ వదిలి పోవాలని భావించడం లేదని స్పష్టం చేశారు. నిన్న కానీ, మొన్న కానీ తన ఇంటికి ఎవరూ రాలేదని, ఇప్పటి వరకు సర్వే చేస్తున్నామంటూ ఎవరూ రాలేదని ఆయన తెలిపారు. సొంత ఇళ్లున్న వారిని స్థానికులు కాదనడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.