: ఇంటి నెంబర్లు 40 కానీ....
సమగ్ర సర్వేలో ఎన్యూమరేటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమగ్ర సర్వే పకడ్బందీగా నిర్వహించేందుకు ఒక్కో ఎన్యూమరేటర్ కు 40 ఇళ్లు కేటాయించారు. అయితే ఒకే ఇంటి నెంబర్ పై అపార్ట్ మెంట్లు ఉండి, అందులో పలు కుటుంబాలు నివసిస్తుండడంతో ఎన్యూమరేటర్లు అవాక్కవుతున్నారు. కొన్ని చోట్ల సమగ్ర సర్వే కోసం ప్రజలు స్వస్థలాలకు తరలడంతో ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. దీంతో కొంత మంది ఎక్కువ ఇళ్లు సర్వే చేయాల్సి వస్తుంటే... మరి కొంత మంది ఎన్యూమరేటర్లు పని లేక గోళ్లు గిల్లుకుంటున్నారు.