: వైఎస్సార్సీపీలో నేరగాళ్లే ఎక్కువ: బాబు
వైఎస్సార్సీపీలో నేరగాళ్లే ఎక్కువ మంది ఉన్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ, పరిటాల రవి హత్య జరిగనప్పుడు తనను కనీసం మాట్లాడనివ్వలేదని గుర్తు చేశారు. ఎర్రచందనం, ఇసుక మాఫియా, ఏటీఎం దొంగలను పక్కన పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని బాబు విమర్శించారు. రాష్ట్రంలో చట్టం అందరికీ ఒకే విధంగా పని చేస్తుందని ఆయన తెలిపారు. ఏపీకి అన్యాయం జరిగిందని కేసీఆర్ చెబుతున్నా, జగన్ లో స్పందన లేదని ఆయన మండిపడ్డారు. శాంతి భద్రతలు ఎవరైనా చేతుల్లోకి తీసుకుంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. వైఎస్సార్సీపీ నేతలు సభామర్యాదలు పాటించాలని ఆయన సూచించారు.