: పాప్ క్వీన్ ఆకాశంలో పెళ్లి చేసుకోవాలనుకుంటోంది!


జుట్టున్నమ్మ ఏ కొప్పు వేసినా అందమే అన్నట్టు... డబ్బున్నామె ఏ కోరిక కోరినా ముచ్చటగానే ఉంటుంది. పెళ్లి అనేది జీవితంలో అత్యంత ఆనందాన్నిచ్చే అంశం. అందుకే పెళ్లి ఎలా చేసుకోవాలనే విషయంలో ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంటుంది. పాప్ క్వీన్ లేడి గాగా తన పెళ్లి వినూత్నంగా జరుపుకోవాలని ఉబలాటపడుతోంది. సుదీర్ఘకాలంగా డేటింగ్ చేస్తున్న ప్రియుడు టేలర్ కిన్నేను 2015 లో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. తన పెళ్లి గురించి కొన్ని తరాల పాటు చెప్పుకునేలా అంతరిక్షంలో జరుపుకోవాలనుందని లేడీ గాగా మనసులో మాట బయటపెట్టింది. వర్జిన్ గాలక్టిక్ ఫ్లైట్ లో కిన్నేను పెళ్లి చేసుకోవాలని ఉందని తెలిపింది. ఆకాశంలో ప్రత్యేక ఫ్లైట్ లో జరుపుకునే పెళ్లికి ఒక్కొక్క సీట్ కోసం 250000 డాలర్లు ఖర్చు అవుతుందని.. అయితే ప్రేమ సందేశాన్ని ప్రపంచానికి తెలియచేయడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుందని లేడి గాగా అభిప్రాయపడుతోంది.

  • Loading...

More Telugu News