: బ్యాంకు, పోస్టాఫీస్ ఖాతా వివరాలిచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు: జీహెచ్ఎంసీ కమిషనర్
ఎట్టి పరిస్థితుల్లోను ఈ రాత్రికి సమగ్ర సర్వేను పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ స్పష్టం చేశారు. అన్ని వివరాలను అందిస్తే... ప్రభుత్వ రాయితీలు పొందే అవకాశం ఉంటుందన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని చెప్పారు. చాలా మంది తమ బ్యాంక్ అకౌంట్లు, పోస్టాఫీస్ ఖాతాల వివరాలు ఇచ్చేందుకు భయపడుతున్నారని ఆయన తెలిపారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని... అన్ని వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు. సర్వే జరుగుతున్న తీరును గవర్నర్ నరసింహన్ ను కలిసి ఆయన వివరించారు.