: చంద్రబాబు ఇంటికి వెళ్లిన సమగ్ర కుటుంబ సర్వే అధికారులు
సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఎన్యూమరేటర్లు ఈ ఉదయం చంద్రబాబు ఇంటికి వెళ్లారు. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఎవరూ ఇంట్లో లేకపోవడంతో... ఎన్యూమరేటర్లు చంద్రబాబు కార్యదర్శి నుంచి సమాచారం తీసుకుని వెనుతిరిగారు. ఇంట్లో ఎవరూ లేకపోయినప్పటికీ... చంద్రబాబు కార్యదర్శి తాము అడిగిన అన్ని వివరాలు అందించారని ఎన్యూమరేటర్లు తెలిపారు.