: శాంతిభద్రతలపై చర్చకు వైకాపా పట్టు... సభను వాయిదా వేసిన స్పీకర్


హత్యారాజకీయాలపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చకు అనుమతించాలని స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు వైకాపా సభ్యులు ఈ రోజు నోటీసు ఇచ్చారు. ప్రశ్నోత్తరాలు కొంచెం సేపు జరిగిన తర్వాత... తాము ఇచ్చిన నోటీసుకు అనుగుణంగా రాష్ట్రంలోని శాంతి భద్రతలపై చర్చకు అనుమతివ్వాలని వైకాపా సభ్యులు స్పీకర్ ను డిమాండ్ చేశారు. రూల్ 344 నిబంధన కింద శాంతిభద్రతలపై రేపు చర్చ చేపడదామని స్పీకర్ వైకాపా సభ్యులకు తెలియజేశారు. అయితే దీనికి వైకాపా సభ్యులు అంగీకరించకుండా... సభలో నినాదాలు చేయడం మొదలుపెట్టడంతో... సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ 15 నిమిషాల పాటు సభను వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News