: రాజధానిపై వేగాన్ని పెంచిన ఏపీ సర్కార్... జిల్లా కేంద్రాల చుట్టూ ప్రభుత్వ భూముల సర్వే
రాజధానిపై ఏపీ సర్కార్ వేగాన్ని పెంచింది. ఈ క్రమంలో 13 జిల్లా కేంద్రాల చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వ భూములు ఎంతెంత ఉన్నాయో సర్వే చేయించింది. జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న భూములు వివరాలు ఇవి... 1. శ్రీకాకుళం - 175 ఎకరాలు 2. విజయనగరం - 581 ఎకరాలు 3. విశాఖ - 1,473 ఎకరాలు 4. తూర్పుగోదావరి - 204 ఎకరాలు 5. పశ్చిమగోదావరి - 79 ఎకరాలు 6. కృష్ణా - 3,247 ఎకరాలు 7. గుంటూరు - 2,012 ఎకరాలు 8. ప్రకాశం - 560 ఎకరాలు 9. నెల్లూరు - 5,824 ఎకరాలు 10. అనంతపురం - 4,270 ఎకరాలు 11. కడప - 689 ఎకరాలు 12. కర్నూలు - 4,972 ఎకరాలు 13. చిత్తూరు - 2,050 ఎకరాలు అత్యధికంగా కర్నూలులో 4,972 ఎకరాలు, నెల్లూరులో 5,824 ఎకరాలు ఉండగా... పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు చుట్టూ ప్రభుత్వ భూములు అత్యల్పంగా (79ఎకరాలు) ఉన్నాయి.