: 'ఎన్టీఆర్ ఆరోగ్య సేవ'గా పేరు మార్చుకోనున్న 'ఆరోగ్యశ్రీ'
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పేరును ఎన్టీఆర్ ఆరోగ్య సేవగా మారుస్తున్నట్టు ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఈ రోజు శాసనసభలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం పరిధిలోకి మరో 100 జబ్బులను తీసుకొస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో యూజర్ ఛార్జీలను పెంచబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రాకింగ్, బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పారు.