: రెండు రోజుల పాటు మండే ఎండలు తప్పవు


ఈరోజు, రేపు రెండు రోజుల పాటు మండే ఎండలు తప్పవని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. విస్తారంగా వర్షాలు కురవకపోవడం వల్లే ఎండల తీవ్రత అధికంగా ఉందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతూ ఉందని... దీని ప్రభావంతో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. తీర ప్రాంతాల్లో ఉక్కుపోత తీవ్రంగా ఉంది.

  • Loading...

More Telugu News