: దంతెవాడ అడవుల్లో కాల్పులు


ఛత్తీస్ ఘడ్ లోని దంతెవాడ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ కాల్పుల్లో మావోయిస్టులు పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. కూంబింగ్ ముగిసిన అనంతరం తిరుగుముఖం పట్టిన పోలీసులపైకి మావోలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. అయితే పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు కోబ్రా జవాన్లకు గాయాలయ్యాయి. గాయాలైన జవాన్లను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల ఎదురుదాడి నేపథ్యంలో మావోయిస్టులు అడవిలోకి పారిపోయారు. పారిపోయిన మావోల కోసం పోలీసులు ముమ్మరంగా సోదాలు చేపట్టారు.

  • Loading...

More Telugu News