: తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన సమగ్ర కుటుంబ సర్వే
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. హైదరాబాద్ లో ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా... జిల్లాల్లో ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఎన్యూమరేటర్లు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించడం ప్రారంభించారు. హైదరాబాద్ లో రాత్రి 7 గంటల వరకు... జిల్లాల్లో రాత్రి 8 గంటల వరకు సమగ్ర కుటుంబ సర్వే చేయనున్నారు. ఒక వేళ హైదరాబాద్ లో ఈ రోజు రాత్రి 7 గంటల్లోపు సర్వే పూర్తవకపోతే... రేపు ఉదయం కూడా సర్వే చేయాలన్న ఆలోచనలో జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు.