: సినీ నటి అపర్ణాసేన్ ను ప్రశ్నించిన ఈడీ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పది వేల కోట్ల శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో ప్రముఖ బెంగాలీ నటి, దర్శకురాలు అపర్ణాసేన్, పశ్చిమ బెంగాల్ టెక్స్టైల్ మంత్రి శ్యామపాద ముఖర్జీని ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రశ్నించారు. శారదా గ్రూపు ఆధ్వర్యంలో నడిచిన పత్రికకు అపర్ణాసేన్ ఎడిటర్‌గా వ్యవహరించారు. దీంతో ఆమె వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు రికార్డు చేశారు. ఆ సమయంలో ఆమె వెంట భర్త కళ్యాణ్ రాయ్ కూడా ఉన్నారు. తమ ప్రశ్నలన్నిటికీ అపర్ణాసేన్ సమాధానం ఇచ్చారని, కేసు విచారణలో పూర్తిగా సహకరిస్తానని ఆమె చెప్పారని అధికారులు తెలిపారు.