: ఆటోను ఢీకొన్న రైలు... 20 మంది మృతి
బీహార్ లో కాపలాదారు లేని రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిన ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. రైల్వే లెవెల్ క్రాసింగ్ ను ఆటో దాటుతుండగా రప్తి గంగా ఎక్స్ ప్రెస్ ఢీకొంది. ఆటోను చాలా దూరం వరకు రైలు ఈడ్చుకునిపోయింది. దీంతో మృతదేహాలు కొన్ని గుర్తుపట్టలేని విధంగా చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ ఘటనలో 20 మంది మరణించగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో 8 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా మాసాయిపేటలో ఇదే తరహాలో ఓ స్కూల్ బస్సును రైలు ఢీకొన్న ఘటనలో పలువురు చిన్నారులు మరణించిన సంగతి తెలిసిందే.