: భారత్ సంగతి పక్కన పెట్టండి... ఇంగ్లండ్ మాత్రం అదుర్స్: బాయ్ కాట్


మాజీ ఇంగ్లండ్ కెప్టెన్ జెఫ్రీ బాయ్ కాట్ ఇంగ్లండ్ క్రికెటర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియాతో ఘోర పరాజయం పాలైన ఇంగ్లండ్ భారత్ పై నెగ్గుతుందా? అని అందరూ అనుమానం వ్యక్తం చేశారని ఆయన గుర్తు చేశారు. టీమిండియా ప్రదర్శన ఇంగ్లండ్ జట్టులో ఆనందం నింపిందని ఆయన పేర్కొన్నారు. బ్యాటింగ్, బౌలింగుల్లో భారత ప్రదర్శన ఇంగ్లండ్ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపిందని తెలిపారు. ఈ స్ఫూర్తితో వన్డేల్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు చెలరేగిపోతారని అన్నారు. టెస్టుల్లో భారత జట్టు ప్రదర్శన కసాయి దగ్గర గొర్రెల మందలా తయారైందని అభిప్రాయపడ్డారు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ...ఇలా అన్నిటా టీమిండియా అట్టర్ ఫ్లాపైందని అన్నారు.

  • Loading...

More Telugu News