: రాష్ట్రాల శాంతి భద్రతల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదు: వెంకయ్యనాయుడు


ఏపీ, తెలంగాణ రాష్ట్రాల పాలన విషయంలోగానీ, శాంతి భద్రతల విషయంలోగానీ కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. సమగ్ర అభివృద్ధిపై రాష్ట్రాలు దృష్టి పెట్టాలని చెప్పారు. విభజన బిల్లు అంశాలను సంబంధిత శాఖలు అధ్యయనం చేస్తున్నాయని ఆయన చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, యూపీఏ అనాలోచిత విధానాల వల్లే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలు ఏర్పడ్డాయని మండిపడ్డారు. భవనాలు, ఆస్తుల కేటాయింపు త్వరలోనే పూర్తవుతుందని వివరించారు. సుపరిపాలన, దేశాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెంకయ్య పేర్కొన్నారు. మత సామరస్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, హిందువు అనే పదాన్ని కొంతమంది వివాదం చేస్తున్నారనీ అన్నారు. భారత్ అంతర్గత విషయాల్లో పాకిస్థాన్ జోక్యం చేసుకోకూడదన్న ఆయన కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమన్నారు. పార్లమెంట్ కమిటీలు ఖరారయ్యాయని, త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News