: అమెరికాలో ఘనంగా సీతారామ కల్యాణం
అమెరికాలో తొలిసారిగా భద్రాచల సీతారామ కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో ఓహియో రాష్ట్ర క్లీవ్ ల్యాండ్ లోని బాలాజీ మందిరంలో సీతారామ కల్యాణం కన్నుల పండువగా సాగింది. భద్రాచల ఆలయ వేదపండితులు కల్యాణాన్ని నిర్వహించి, భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి 600 మందికి పైగా భక్తులు హాజరయ్యారని నిర్వాహకులు తెలిపారు.