: సమగ్ర కుటుంబ సర్వేలో పూర్తి వివరాలు ఇవ్వండి: కేసీఆర్


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతం చేయాలని సీఎం కేసీఆర్ కోరారు. సర్వే చేసే అధికారులకు పూర్తి సమాచారం ఇచ్చి, ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆయన అభిలషించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు సర్వే నిర్వహిస్తున్నామని, ఎవరి అవసరాలు ఏమిటో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News