: జాకీ చాన్ కుమారుడు జాయ్ సీ చాన్ అరెస్టు
హాలీవుడ్ కుంగ్ ఫూ సూపర్ స్టార్ జాకీ చాన్ కుమారుడు జాయ్ సి చాన్ ను చైనా పోలీసులు అరెస్టు చేశారు. నిషేధిత మాదక ద్రవ్యాలు తీసుకున్నాడని అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న జాయ్ సి చాన్... ఫాంగ్ జుమింగ్ గా చైనాలో పాప్యులర్. జాయ్ సి చాన్ తన స్నేహితుడు, తైవాన్ సినిమా హీరో కైకో చెన్ తుంగ్ తో కలసి వస్తుండగా పోలీసులు వారిద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. ప్రతి రోజూ క్రమం తప్పకుండా సోషల్ మీడియాకు అందుబాటులో ఉండే జాయ్ సి చాన్ గత మంగళవారం నుంచి సోషల్ మీడియాలో కనబడలేదు. కాగా అతడిని పోలీసులు ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారన్న సమాచారంపై స్పష్టత లేదు.