: క్షణాల్లో అమ్ముడైపోతున్న చైనా ఫోన్ల విక్రయానికి ఫ్లిప్ కార్ట్ మరోసారి రెడీ
క్షణాల్లో అమ్ముడైపోతున్న చైనా ఫోన్ జియోమీ ఎంఐ3 ఫోన్ల విక్రయానికి ఫ్లిప్ కార్ట్ రెండోసారి రెడీ అవుతోంది. రేపు (మంగళవారం) మధ్యాహ్నం 2 గంటలకు ఆన్ లైన్ లో ఫ్లిప్ కార్ట్ అమ్మకాలు ప్రారంభించనుంది. 13,999 రూపాయల విలువైన జియోమీ ఎంఐ3 మొబైల్ ఐ ఫోన్, శామ్ సంగ్, నోకియా అత్యధిక ధర ఫోన్లకు సవాలు విసురుతోంది. అన్ని ఫీచర్లతో కూడిన ఫోన్ తక్కువ ధరకు లభ్యమవుతుండడంతో వినియోగదారులు వీటిని కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. గతంలో ఈ ఫోన్ అమ్మకాల సందర్భంగా వినియోగదారుల తాకిడికి ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ క్రాష్ అయిపోయింది. కేవలం 40 నిమిషాల్లోనే అమ్మకానికి పెట్టిన స్టాకంతా అయిపోయింది. తాజాగా 75 వేల ఫోన్లకు వినియోగదారులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషం.