: మెదక్ ఎంపీ సీటు దేవీప్రసాద్ కు ఇవ్వాలని టీఎన్జీవో తీర్మానం
ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టాక ఖాళీ అయిన మెదక్ ఎంపీ సీటును టీఆర్ఎస్ తరపున టీఎన్జీవోల నేత దేవీ ప్రసాద్ కు ఇవ్వాలని టీఎన్జీవో సంఘం తీర్మానించింది. ఈ విషయంపై త్వరలో సంస్థ తరపున కొంతమంది వెళ్లి సీఎం కేసీఆర్ ను కలవాలని నిర్ణయించింది. రెండు రోజుల కిందటే ఈ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సఘం షెడ్యూల్ విడుదల చేసింది.