: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురిశాయ్
కోస్తాంధ్ర, రాయలసీమపై ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మచిలీపట్నం, తిరుమలలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కారంచేడు, అద్దంకిలలో 5 సెం.మీ, కలకాడలో 4, రాపూరు, సంతమాగులూరు, పాతపట్నం, గుంటూరు, ముండ్లమూరు, దర్శి, చిలమత్తూరు, ఆరోగ్యవరం, వెంకటగిరిలలో 3 సెం.మీ వర్షపాతం నమోదైంది. అనంతరాజుపేట, పుంగనూరు, కుప్పం, కల్యాణదుర్గం, కదిరి, కంభాలపల్లె, జియమ్మవలసలలో 2 సెం.మీ వర్షం కురిసింది. గజపతినగరం, సత్తెనపల్లి, తెనాలి, ఒంగోలు, బాపట్ల, పాకాల, హిందూపురం, పులివెందులలో సెంటీమీటరు చొప్పున వర్షపాతం నమోదైంది.