: వెయిట్ లిఫ్టర్ మత్స సంతోషికి విశాఖలో ఘనసన్మానం
వెయిట్ లిఫ్టర్ మత్స సంతోషికి విశాఖలో ఘనసన్మానం జరిగింది. ఆంధ్రా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ సంతోషికి పూలమాల వేసి సన్మానించారు. కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మత్స సంతోషి రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే. క్రీడాకారులు సంతోషిని స్ఫూర్తిగా తీసుకోవాలని ఏయూ వైస్ ఛాన్సలర్ అన్నారు. ఈ సందర్భంగా సంతోషి మాట్లాడుతూ ప్రభుత్వ సహకారం ఉంటే మరిన్ని పథకాలు సాధిస్తానని అన్నారు.