: వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు
దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీకృష్ణుని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతిలోని ఇస్కాన్ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ముంబయిలో ‘దహి హండీ’ కార్యక్రమాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా దహి హండీ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ ఉట్టి కొట్టే కార్యక్రమంలో యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.