: అమ్మ హస్తం కాదు ... భస్మాసుర హస్తం :టీడీపీ నేత కామెంట్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై టీడీపీ నేతల విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉపనేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా ప్రాపకంతో కిరణ్ ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు. ఓ సీల్డ్ కవర్ తో ముఖ్యమంత్రి అయిన కిరణ్ కు చంద్రబాబును విమర్శించే అర్హత లేదని దుయ్యబట్టారు. సీఎంకు సొంత జిల్లాలో ఉన్న మండలాలు ఎన్నో తెలీదని ఆయన ఎద్దేవా చేశారు.
ఇక కాంగ్రెస్ సర్కారు ఇందిర పేరిట ప్రవేశపెట్టిన పలు పథకాల పేర్లు మార్చుకోవాలని చెప్పారు. ఇందిరమ్మ బాటకు ఇందిర నరక బాట అని, అమ్మ హస్తం కార్యక్రమానికి భస్మాసుర హస్తం అని కొత్త పేర్లు పెట్టుకోవాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమాల ప్రచారానికే వందల కోట్లు దుర్వినియోగం చేస్తున్నారని ముద్దుకృష్ణమనాయుడు మండిపడ్డారు.