: అప్పుడూ ఇదే ప్రశ్న అడగలేదా?: ధోనీ


తాజా పరాభవంపై టీమిండియా మేనేజ్ మెంట్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పలు ప్రశ్నలకు ప్రశ్నలనే సమాధానంగా సంధించాడు. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ నుంచి వైదొలుగుతారా? అన్న ప్రశ్నకు జవాబిస్తూ, "ఇదే ప్రశ్న నన్ను 2011లో అడగలేదా?" అంటూ తిరిగి ప్రశ్నించాడు. కెప్టెన్ పదవిలో ఉంటానో, వైదొలుగుతానో తెలుసుకోవాలంటే కొన్నాళ్ళు వేచి చూడాలని మీడియాకు సూచించాడు. ఐపీఎల్ కారణంగానే భారత ఆటగాళ్ళు సరైన ఆటతీరు కనబర్చలేకపోయారా? అని ఓ మీడియా ప్రతినిధి అడగగా, "నన్నెందుకు అడుగుతారు? ఆ విషయాన్ని బీసీసీఐనే అడగండి" అని కటువుగా బదులిచ్చాడు. కాగా, 2011లో టీమిండియా... ఇంగ్లండ్, ఆస్ట్రేలియా గడ్డలపై దారుణ పరాభవాలు చవిచూసింది. అప్పుడు కూడా ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలంటూ మాజీలు హితవు పలికారు.

  • Loading...

More Telugu News