: ప్రపంచంలో ఇద్దరు హిట్లర్లున్నారు, వారిలో ఆర్ఎస్ఎస్ చీఫ్ ఒకరు: దిగ్విజయ్


భారత్ ఓ హిందూ దేశమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పునరుద్ఘాటించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ స్పందించారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ ఓ నియంత అని ట్వీట్ చేశారు. సంఘ్ పరివార్ ఇకనైనా అమాయక ప్రజలను మోసగించడం మానుకోవాలని హితవు పలికారు. "మనకు ఒకడే హిట్లర్ ఉన్నాడని భావించేవాడిని. కానీ, ఇద్దరున్నట్టు తెలుస్తోంది. ఇక దేశాన్ని ఆ దేవుడే కాపాడాలి!!" అని ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా డిగ్గీరాజా ఓ ప్రశ్నాస్త్రం సంధించారు. హిందుత్వ ఓ మతపరమైన గుర్తింపు అయితే, దానికీ, సనాతన ధర్మానికీ ఉన్న సంబంధమేంటో చెప్పాలన్నారు. ఇస్లాం, క్రైస్తవం, సిక్కు, బుద్ధిజం, జైనిజం... ఇలా ఏదైనా ఓ మతాన్ని నమ్మే వ్యక్తి హిందువు అవుతాడా? దీనికి మోహన్ భగవత్ స్పష్టత ఇస్తారా? అని ఈ సీనియర్ నేత ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News