: కాచిగూడ-నిజామాబాద్ రైలు నుంచి దూకి గాయపడ్డ 200 మంది
భయం అనేది మనిషిని ఎంతకైనా తెగించేట్టు చేస్తుంది. ఇప్పడూ అదే జరిగింది. కాచిగూడ-నిజామాబాద్ ఫాస్ట్ ప్యాసింజర్ రైల్లో మంటలు అంటుకున్నాయని వదంతులు రావడంతో... రంగారెడ్డి జిల్లా గుండ్లపోచంపల్లి వద్ద ప్రయాణికులు చైను లాగి రైలును ఆపేశారు. మరికొంత మంది కదులుతున్న రైల్లో నుంచే దూకేశారు. దీంతో దాదాపు 200 మంది గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు.