: బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటున్న అమెరికా పరిశోధకులు!


నేటి కాలంలో యువకుల్లోనూ బట్టతల సమస్య కనిపిస్తోంది. వాతావరణ కాలుష్యం, జన్యుక్రమం వంటి అంశాలు బట్టతలకు కారణం. దీన్ని వైద్య పరిభాషలో అలోపేషియా ఆరియేటాగా పిలుస్తారు. రోగ నిరోధక వ్యవస్థ విడుదల చేసే కొన్ని ఎంజైముల కారణంగానే జుట్టు ఊడిపోవడం సంభవిస్తోందని అమెరికా పరిశోధకులు అంటున్నారు. ఈ మేరకు కొలంబియా వర్శిటీ పరిశోధకులు ఓ విరుగుడు ఔషధాన్ని కనుగొన్నారు. ఈ మందు వాడడం మొదలుపెట్టిన ఐదు నెలల్లోనే కొందరు వ్యక్తుల తలపై పూర్తిస్థాయిలో జుట్టు మొలిచిందని కొలంబియా వర్శిటీ పరిశోధకుల బృందానికి నాయకత్వం వహించిన రాఫెల్ సైక్లోన్స్ పేర్కొన్నారు. మొదట ఎలుకలపై ఇందుకు సంబంధించిన ప్రయోగాలు నిర్వహించారు. వ్యాధి నిరోధక వ్యవస్థలో ప్రధాన భూమిక పోషించే టి సెల్స్ విడుదల చేసే ఎంజైములు జట్టు రాలిపోవడానికి కారణమవుతున్నాయని గుర్తించారు. అనంతరం ఆ డ్రగ్ ను కొందరు వాలంటీర్లపై ప్రయోగించగా, అది టి సెల్స్ కు చక్కగా అడ్డుకట్ట వేస్తుందన్న విషయాన్ని గమనించారు.

  • Loading...

More Telugu News