: అవగాహన లేదన్న జీహెచ్ఎంసీ కమిషనర్... మధ్యాహ్నం 12.30కు సర్వే కేసు వాయిదా
సమగ్ర సర్వేపై విచారణ చేపట్టిన హైకోర్టు విచారణను మధ్యాహ్నం 12.30 కు వాయిదా వేసింది. ఆర్టికల్ 162 ప్రకారం ప్రభుత్వం జీవో జారీ చేయకుండా ఇలాంటి సర్వే చేయకూడదని పిటిషనర్ హైకోర్టులో వాదించారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వేపై జీవో జారీ చేసిందా? అని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ ను హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం జోవో జారీ చేసిన విషయంపై తనకు అవగాహన లేదని సోమేష్ కుమార్ కోర్టుకు సమాధానమిచ్చారు. కాసేపు సమయమిస్తే తెలంగాణ ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ ఈ కేసు వాదించడానికి వస్తారని సోమేష్ కుమార్ కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు ఈ కేసును మధ్యాహ్నం 12.30 కు వాయిదా వేసింది.